చిన్న శంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తా వద్ద గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. గత పదిహేను రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని వాపోతున్నారు. నీళ్లు రావడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే లేకుండా పోయారని చెబుతున్నారు. నీటి సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు.. మెదక్ చేగుంట రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు.
న్యూస్ లైన్ డెస్క్: తాగు నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర ప్రాంతాల్లో ఈ సమస్య కాస్త తక్కువే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తాగునీటి సమస్య తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్న వేళ నీటి సమస్య రావడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజగా, మెదక్ జిల్లాలో కూడా తగు నీటి సమస్యతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న శంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తా వద్ద గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. గత పదిహేను రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని వాపోతున్నారు. నీళ్లు రావడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే లేకుండా పోయారని చెబుతున్నారు. నీటి సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు.. మెదక్ చేగుంట రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నీటి సమస్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే నిరసనలను మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.