గ్రామంలోని సాగు చేస్తున్న సుమారు 2 వేల ఎకరాలకు నీరు అందడంలేదని రైతుల వాపోతున్నారు. వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో పంట పొలాలు ఎండుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే నారు పోసి, నీరు లేకపోవడంతో పొలంలో తేమ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను రక్షించుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని పెడుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: వర్షాకాలం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ఓవైపు తాగు నీరు లేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పంట పొలాలకు నీరు అందకపోవడంతో రైతన్నలు గోసలు పడుతున్నారు. ఓవైపు కాలువల్లో, మరోవైపు బోర్లలో నీరు కూడా లేకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వానాకాలం వచ్చింది కదా అని నారు పోసిన రైతులకు నీరు అందక కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక.. ట్యాంకర్లతో పొలానికి నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల జిల్లా ఆత్మకూర్ గ్రామంలో రైతున్నలు పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.