సీఎం రేవంత్ రెడ్డికి మాట్లాడడం ఇష్టం లేదా..? లేదంటే ఇబ్బంది పడుతున్నారా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కూడా పేమెంట్ కోటలోనే సీఎం అయ్యారని మేము కూడా అనొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూస్ లైన్ డెస్క్: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతుండగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మైక్ అఫ్ చేశారు. ముఖ్యమంత్రి ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టి, వాదన వినిపించాలి కానీ ముఖ్యమంత్రి మాట్లాడకుండా మంత్రులతో మాట్లాడిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
అయితే, సీఎం రేవంత్ రెడ్డికి మాట్లాడడం ఇష్టం లేదా..? లేదంటే ఇబ్బంది పడుతున్నారా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కూడా పేమెంట్ కోటలోనే సీఎం అయ్యారని మేము కూడా అనొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తాతలు, తండ్రులు అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీల గురించే ఆయన ఆ మాటలు అన్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం తమకు లేదని, ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ పేరు తియ్యకుంటే ముఖ్యమంత్రికి బతుకుదెరువు లేదా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మోడీ పేరు తీసుకొని మాట్లాడడానికి అంత భయం ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడే వారు రానున్న రోజుల్లో ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలు ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల పక్షాన ఇక్కడే ఉంటామని, ఆరు గ్యారెంటీలు అమలు అయ్యేవరకు మిమ్మల్ని అడుగడుగునా ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు.
అయితే, కేటీఆర్ మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ అఫ్ చేసేశారు. దీంతో BRS సభ్యులు అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి అసెంబ్లీలో చర్చ జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చలు జరపాలని ఆయన సూచించారు.