న్యూస్ లైన్ డెస్క్ : ‘‘ఊరికే రారు .. మహానుభావులు‘‘ అన్నట్లుగా ఉందట రాష్ట్రంలో సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా పర్యటన. సడెన్ గా రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు రావడంపై పార్టీలోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. ఎప్పుడు లేనిది, ఏ కారణం లేకుండా ఎందుకు వచ్చారు.?, పండుగల సమయం కాదు.. అలా అని ఏ మొక్కు లేకుండా దేవుడి గుళ్లను అడ్డుపెట్టుకోని రావాల్సిన అవసరం ఏముందనే చర్చ రాజకీయాల్లో జోరుగా జరుగుతోందట. అయితే ఆయన పర్యటన వెనుక ఓ గూఢాచారి సీక్రెట్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
దేశంలో త్వరలో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి భారీగా ఫండ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ ఫిక్స్ చేసిందట. దీంతో ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి ఆ దిశగా వసూళ్లు కార్యక్రమం మొదలు పెట్టారని తెలుస్తోంది. అందుకు హైడ్రాను సైతం అడ్డుపెట్టుకొని బ్యాగులు బ్యాగులు వసూళ్లు చేశారనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా వినిపిస్తోంది. దీనిలో భాగంగా మొదటి విడతలో కొంత అమౌంట్ ను రేవంత్ రెడ్డి సిద్ధం చేసినట్లు అధిష్టానానికి సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వసూళ్లు అయినా బ్యాగులను తీర్థయాత్రల చాటునా సీక్రెట్‌గా సూట్ కేసుల్లో తరలించేందుకు రాబర్ట్ వాద్రా వచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సడెన్‌గా రాష్ట్ర పర్యటనకు రావడం, వచ్చిన పని చకచకా చేసుకొని, సంచులతో యూటర్న్ అయినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీని కోసమే రాబర్డ్ వాద్రా వచ్చారని, ఆయన పర్యటన వెనుక ఏ దేవుడు, సామాజిక సేవ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మారిందన్న ప్రతిపక్షాల ఆరోపణలు ఊరికే రాలేదన్న చర్చ రాష్ట్రంలో నడుస్తోంది.