విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
న్యూస్ లైన్ డెస్క్ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలం లేకపోవడంతో పోటీలో నుంచి టీడీపీ తప్పుకుంది. ఇక స్వతంత్ర అభ్యర్థి షఫీ కూడా నామినేషన్ ఉపసంహరించడంతో బొత్స విజయం సాధించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. మూడేళ్ల పాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
విశాఖ కలెక్టరేట్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఘన విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికలో తమ సంఖ్యా బలం పెంచుకోలేమని తెలిసి టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని టీడీపీ ప్రయత్నించింది. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రవాహంలా టీడీపీలో వచ్చిచేరుతారని ఊహించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీచేసే అవకాశం రాని దిలీప్ చక్రవర్తిని ఎమ్మెల్సీగా పోటీలో పెట్టాలని చంద్రబాబు భావించారు. కానీ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పార్టీ ప్రకటిచింది. దీంతో పోటీలో గెలవలేమని టీడీపీ ఆశాలు వదిలేసింది.