ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరగనున్న ఈ సీజన్ లో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ ఇండస్ట్రీ నుంచి ప్లేయర్స్ క్రికెట్ లీగ్ లో పాల్గొంటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టాలీవుడ్ స్టార్స్ క్రికెటర్లుగా మారుతున్నారు. సినిమాల్లో అలరించే యాక్టర్స్ బ్యాట్ పట్టుకొని సిక్సర్లు బౌండరీల వర్షం కురిపిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. హిరీలు బ్యాట్ తో సిక్సర్లు కొట్టడానికి వచ్చేస్తున్నారు. రేపు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 11 వ సీజన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరగనున్న ఈ సీజన్ లో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ ఇండస్ట్రీ నుంచి ప్లేయర్స్ క్రికెట్ లీగ్ లో పాల్గొంటారు.
తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్, ముంబై హీరోస్, భోజ్‌పురి దబాంగ్స్ జట్టు సీసీఎల్-2025 బరిలో నిలిచాయి. తెలుగు వారియర్స్ జట్టుకు కెప్టెన్‌గా అక్కినేని అఖిల్ ఉండగా.. బెంగాల్ టైగర్ కు జిషు సేన్ గుప్తా, కర్ణాటక బుల్డోజర్స్ కిచ్చ సుదీప్, చెన్నై రైనోస్ హీరో ఆర్య, ముంబై హీరోస్ సాకిబ్ సలీం, పంజాబ్ ది షేర్ సోను సూద్, భోజ్‌పురి దబాంగ్స్ మనోజ్ తివారీ లు సారథులుగా వ్యవహరించనున్నారు. ఈ క్రికెట్ లీగ్ సోనీ టెన్ 3 ఛానల్ లో లైవ్ వస్తుంది. అంతేకాదు ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు.
ఫిబ్రవరి 8న – కర్ణాటక బుల్డోజర్స్
ఫిబ్రవరి 14న – భోజ్‌పురి దబాంగ్స్
ఫిబ్రవరి 15న – చెన్నై రైనోస్
ఫిబ్రవరి 23న – బెంగాల్ టైగర్స్