Teenmar Mallanna: తీర్మాన్ మల్లన్న కు కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ ...పార్టీ నుంచి సస్పెండ్ !

పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి పేరట ఉత్తర్వులు వెలువడ్డాయి.


Published Mar 01, 2025 01:52:00 PM
postImages/2025-03-01/1740817441_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కారణంతో తీన్మార్ మల్లన్న కు ఫిబ్రవరి 5 టీపీసీసీ క్రమశిక్షణ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే ఆయన నుంచి దీని పై ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి పేరట ఉత్తర్వులు వెలువడ్డాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu congress mallannasagar party

Related Articles