కేంద్ర ఉద్యోగుల డిఏ పెంపు!

కేంద్ర సర్కార్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు  బిజెపి ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ తెలియజేసింది. డియర్ నెస్ అలవెన్స్  రెండు శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డిఏ పెంపును కేంద్ర 


Published Mar 28, 2025 04:22:58 PM
postImages/2025-03-28/1743159178_govt.jpg

న్యూస్ లైన్, తెలంగాణం డెస్క్:కేంద్ర సర్కార్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు  బిజెపి ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ తెలియజేసింది. డియర్ నెస్ అలవెన్స్  రెండు శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డిఏ పెంపును కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం చెప్పడంతో  కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగులంతా ఆనంద పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల జూలై ఒకటో తేదీ నుంచి చెల్లించాల్సిన కరువు భత్యం  రేటు 53% నుంచి 50 శాతానికి పెరిగింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరబోతుంది. ఇందులో 48 లక్షల మంది ఉద్యోగులు, 67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరందరికీ ఏడవవేతన సంఘం సిఫార్సుల ఆధారంగానే జీతాలు చెల్లిస్తున్నారు. కేంద్ర సర్కార్ సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంచుతుంది. కానీ జనవరి, జూలైలో ఇది పెరగాల్సి ఉన్నప్పటికీ  ఏటా మార్చి అక్టోబర్ లో ప్రకటిస్తూ వస్తున్నది.

లేటుగా ప్రకటించిన కానీ అన్ని బకాయిలతో కలిపి  జీతాలు చెల్లిస్తున్నారు. డిఏ సవరణ కొరకు ఆలిండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ను ప్రాతిపదికన తీసుకోబోతోంది. గత సంవత్సరం అక్టోబర్ లో దీపావళి కానుకగా డిఏ మూడు శాతం పెంచిన విషయం అందరికీ తెలిసింది.  కేంద్రం డిఏ పెంచడంతో  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు డిఏ పెంచే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  డి ఏ పెరుగుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line centralgovernment bjp central-govt-employees central-govt-employees-da

Related Articles