HCU లో జింక మృతి
క్యాంపస్ వైపు రావడంతో కుక్కల దాడి
హాస్పిటల్‌కు తరలించేలోపే మృతి
జనవాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు
ఇళ్లలోకి వెళ్తున్న మూగజీవాలు
‘‘ పచ్చని అడవిలో ప్రశాంతంగా బతుకుతున్న ఆ మూగజీవాలు ఇప్పుడు రేవంత్ దెబ్బకు నడిరోడ్డునపడ్డాయి. ఎక్కడికి వెళ్లాల్లో తెలియక కాలనీల్లోకి చొరబడుతున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు రోడ్ల మీదకు రావడంతో కుక్కలు దాడులు చేస్తున్నాయి. సర్కార్ చేసిన పాపానికి అభం..శుభం తెలియని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. HCUలో కుక్కలు దాడి చేయడంతో ఓ జింక మృతి చెందింది. ‘‘
తెలంగాణం, హైదరాబాద్ (ఏప్రిల్ 4) : హెచ్సీయూలోని 400 ఎకరాల్లో ఉన్న అడవిని రేవంత్ సర్కార్ నేల మట్టం చేసే ప్రయత్నం చేయడంతో అందులో ఉన్న మూగజీవాలు రోడ్డునపడ్డాయి. నిన్నమొన్నటి వరకు అక్కడ దొరికిన ఆహారంతో జీవిస్తే , ఇప్పుడు గుక్కెడు నీళ్లు కూడా దొరక్కపోవడంతో కాంక్రీట్ జంగీల్ లోకి వస్తున్నాయి. HCUలో చెట్లను కొట్టి వేయడంతో సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు ఓ జింక వచ్చింది. దీంతో జింకను చూసిన కుక్కలు దానిపై దాడి చేశాయి. ఇది గమనించిన స్టూడెంట్స్ వెంటనే వాటిని తరిమికొట్టారు. అయితే అప్పటికే కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన జింకను విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. అయితే జింకకు తీవ్ర రక్తస్రావం జరగడంతో అది చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.
HCUలో చెట్లను కొట్టి వేయడంతో జింకలు తమ స్థానాన్ని కోల్పోవడంతో గూటికి కోసం ప్రాణాలకు తెగించి తిరుగుతున్నాయి. అడవిలో ఉండాల్సినవి నడి రోడ్డుపై తిరుగుతున్నాయి. భయంతో ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నాయి. క్యాంపస్ దగ్గరలో ఉన్న గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లోకి జింకలు వచ్చాయి. ఓ ఇంట్లోకి చేరి భయం భయంగా గడిపింది. దీంతో ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకున్నారు.