నోటా వద్దేవద్దు..!


Published Feb 13, 2025 12:52:22 PM
postImages/2025-02-13/1739431342_WhatsAppImage20250213at12.45.49PM.jpeg

నోటా వద్దేవద్దు

ఏకగ్రీవాలే చేసుకుంటం

ఈసీకి చెప్పిన కాంగ్రెస్

నోటా పెట్టాలన్న బీఆర్ఎస్

ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్న బీజేపీ

నోటాపై కుదరని పార్టీల ఏకాభిప్రాయం

2 రోజుల్లో అభిప్రాయలు చెప్పాలన్న ఈసీ

 

 

తెలంగాణం, హైదరాబాద్ (ఫిబ్రవరి 12) : రాష్ట్రంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట నోటా పెట్టాలన్న ప్రతిపాదనపై రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం అన్ని పార్టీలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు, టీడీపీ, జనసేన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నోటా విధానాన్ని ఈసీ వివరించింది. రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయడంపై పార్టీల అభిప్రాయాలు కోరింది. నోటాపై పార్టీలు భినాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. దీంతో రెండు రోజుల్లోగా పార్టీ తరపున తమ అభిప్రాయాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

 

సర్పంచ్ ఎన్నికల్లో నోటాను అభ్యర్ధిగా పరిగణించడాన్ని అధికారపార్టీ కాంగ్రెస్ వ్యతిరేకించింది. గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం అయిన తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో కూడిన విషయమని అభిప్రాయపడింది. ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజయంగా పరిగణించాలని కాంగ్రెస్ కండిషన్ పెట్టింది. అయితే బీఆర్ఎస్ మాత్రం నోటాకే సై అని తెలిపింది. ఏకగ్రీవ ఎన్నికలు పెడితే బెదిరింపులు, బలప్రదర్శనలు చేసే అవకాశం ఉందని, ఆ కారణంగా నోటాను అభ్యర్ధిగా పరిగణించడం మంచి నిర్ణయమే అని అభిప్రాయపడింది. దీంతో పాటు కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది.

 

ఏకగ్రీవ ఎన్నికలపై సుప్రీం కోర్టులో పిటిషన్ ఉండటంతో తమ అభిప్రాయం ఏం చెప్పలేమని బీజేపీ తెలిపింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని, ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని తెలిపింది. మరోవైపు సీపీఎం పార్టీ స్పందిస్తూ అభ్యర్ధి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ ఎలక్షన్ జరపడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. ఎన్నికల్లో సింగిల్ క్యాండిట్ ఉన్నా నోటా ఉండాలని జనసేన సూచిచింది. టీడీపీ మాత్రం తమ అభిప్రాయం రెండు రోజుల్లో చెబుతామని స్టేట్ ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు.

 

రాష్ట్రంలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎన్నికల కమిషన్ మరో రెండు రోజుల గడువు ఇచ్చింది. తమ పార్టీల్లో చర్చించి లిఖితపూర్వకంగా తమ అభిప్రాయలు తెలపాలని కోరింది. అయితే అధికారపార్టీ కాంగ్రెస్ నోటాకు ఒప్పుకోకపోవడంతో సర్పంచ్ ఏకగ్రీవాలకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ సారి ఎన్నికల్లో నోటాకు అవకాశం లేనట్లు సమాచారం.

newsline-whatsapp-channel
Tags : brs congress bjp government

Related Articles