ప్రపంచంలోని పలు దేశాల్లో శుక్రవారం భూ ప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా మయన్మార్, చైనా, థాయిలాండ్ లో భూమి కంపించడంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ దేశాలతో పాటుగా భారత దేశంలో
తెలంగాణం, ఢిల్లీ (మార్చి 28): ప్రపంచంలోని పలు దేశాల్లో శుక్రవారం భూ ప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా మయన్మార్, చైనా, థాయిలాండ్ లో భూమి కంపించడంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ దేశాలతో పాటుగా భారత దేశంలో కూడా ఈ భూకంప తీవ్రత కాస్త కనిపించింది.
ముఖ్యంగా పరాయి దేశాల్లో రిక్టర్ స్కేలుపై 7.7 మరియు 6.4 తీవ్రతతో రెండు భూకంపాలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎన్సిఆర్, కోల్ కత్తా తో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి.
ముఖ్యంగా కోల్కత్తా, నోయిడా, మేఘాలయ, గజియాబాద్, మణిపూర్, రాష్ట్రాల్లో భూకంప తీవ్రత 4.4 ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమి కంపించడంతో ఈ రాష్ట్రాల్లోని ప్రజలంతా ఒక్కసారిగా ఆఫీసు, ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్తి నష్టం ప్రాణ నష్టం పెద్దగా జరగలేదని అధికారులు తెలియజేశారు.