GOA Tourism: సాంబార్ , ఇడ్లీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోవా ఎమ్మెల్యే !

యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి పర్యాటకులు గోవాకు రావడం లేదని తెలిపారు. మైఖేల్ లోబో వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.


Published Feb 27, 2025 09:30:00 PM
postImages/2025-02-27/1740672085_AA1zUwBu.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రీసెంట్  గా గోవా లో పర్యాటకుల సంఖ్య భారీ గా తగ్గిపోయింది. ఈ అంశంపై గోవా స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నార్త్ గోవాలోని కలంగూట్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బెంగుళూరు నుంచి వచ్చిన వాళ్లు బీచ్ లో వడాపవావ్ అమ్ముతున్నారని ...మరికొంతమంది ఇడ్లీ , సాంబార్ విక్రయిస్తున్నారని విమర్శించారు. దీనివల్లే గత రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి పర్యాటకులు గోవాకు రావడం లేదని తెలిపారు. మైఖేల్ లోబో వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu comments mla- goa tourist

Related Articles