KTR: రేవంత్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి

విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా, లేక రేవంత్ రెడ్డి సన్నాసా చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు


Published Jul 11, 2024 06:33:06 PM
postImages/2024-07-11//1720702986_brsv.jpg

న్యూస్ లైన్ డెస్క్: విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా, లేక రేవంత్ రెడ్డి సన్నాసా చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్వీ నాయకులను పోలీసులు వారిపై దాడి చేశారు. పోలీసులు బీఆర్‌ఎస్వీ నాయకులపై చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6 వేల అదనపు పోస్టులతో విద్యార్థులను, నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి దగా చేస్తున్నాడని ఆరోపించారు. విద్యార్ధులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైయిరీలో నమోదు చేస్తున్నానాని, మేము అధికారంలోకి వచ్చినాక ఎవరిని వదిలిపెట్టమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు. అనంతరం బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల పోరాట ప‌టిమ‌ను కేటీఆర్ ప్ర‌శంసించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మీ పోరాట ప‌టిమను అనేక సంద‌ర్భాల్లో చూపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన‌ప్పుడు, గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 పిల‌వాల‌ని, డీఎస్సీ వాయిదా వేయాల‌ని మీరు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై పోరాడుతూనే ఉండాల‌ని కేటీఆర్ సూచించారు. ఎల్ల‌ప్పుడూ పార్టీ అగ్ర నాయ‌క‌త్వం బీఆర్ఎస్వీ నాయ‌కుల‌కు అండ‌గా ఉంటుంద‌ని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు.

newsline-whatsapp-channel
Tags : telangana students mla brs ktr cm-revanth-reddy dsc

Related Articles