KTR: మత్స్యకారుల మెడపై కత్తి పెట్టిన రేవంత్ సర్కార్.!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో  ప్రతి ఏడాది మత్స్యకారులకు ప్రభుత్వమే సబ్సిడీపై చేపలను అందించి వారి జీవనోపాధికి దారులు వేసింది. కానీ కాంగ్రెస్ 


Published Sep 25, 2024 10:14:41 AM
postImages/2024-09-25/1727239481_tg.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో  ప్రతి ఏడాది మత్స్యకారులకు ప్రభుత్వమే సబ్సిడీపై చేపలను అందించి వారి జీవనోపాధికి దారులు వేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  చేపలవలలో మత్స్యకారులే చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నారు.  అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకుంటున్న దాఖలాలయితే లేవు. గత ప్రభుత్వంలో  ఈ సమయం వరకు ప్రతి చెరువులో చేప పిల్లలు  పోసేవారు.

 ఈ ఏడాది అసలు చేప పిల్లల పంపిణీ కూడా ప్రారంభం చేయలేదు, అసలు అసలు ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం బయటకు తీసుకురావడం లేదు. చేప పిల్లల పంపిణీ కోసం కనీసం టెండర్లు కూడా ఇప్పటివరకు పిలవలేదు. అంతేకాకుండా  సెప్టెంబర్ నెల వరకు టెండర్లు పిలిచి చేప పిల్లల పంపిణీ జరగాలి.కానీ ఈ ప్రభుత్వం ఆ వైపు దృష్టి పెట్టకపోవడంతో మత్స్యకారులు దారుణంగా విలపిస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఇలా అన్నారు..

వృత్తి కులాలపై కత్తి కట్టినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, మత్తడి దుంకే చెరువుల్లో మత్యసంపద సృష్టించిన నిన్నటి నీలి ప్రభుత్వ విప్లవాన్ని నీరు గారుస్తున్నారని తెలియజేశారు. అసలు ఈ పథకాన్ని చేయగొట్టడం కోసమే కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుందని అన్నారు. ఇప్పటిదాకా చేప పిల్లల పంపిణీ మొదలు కాకపోవడం అసలు టెండర్ల దశను కూడా దాటకపోవడం, అసలు చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదో కూడా తెలియకపోవడం, ఈ ప్రభుత్వ అసమర్ధతకు  నిదర్శనమని అన్నారు.

చేపల వేటని నమ్ముకుని బతుకుతున్నటువంటి బహుజన కులాల బతుకుదెరువును ప్రభుత్వం దెబ్బతీయడం న్యాయమా అని ప్రశ్నించారు.  గత ప్రభుత్వంలో ఉచిత చెప పిల్లలు పంపిణీ చేసి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని, ఇన్ ల్యాండ్ ఫిష్ ఉత్పత్తిలో తెలంగాణ అద్భుతాలు చేసిందని తెలియజేశారు. కానీ ఈ ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లను తుడిచి పెట్టాలనే, రాజకీయ కక్షతో మత్స్యకారుల జీవనోపాధిని కాలరాస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మరి చూడాలి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy news-line ktr fish-scheme fishermens

Related Articles