చిరుత సంచారంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు చాలా ప్లేసుల్లో బోన్లు ఏర్పాటుచేశారు. అయితే బోనులో చిక్కకుండా చిరుత తప్పించుకుంటుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా క్యాంపస్ లో చిరుత తిరుుగుతుందనే అనుమానం ఉందని ..ఈ రోజు ఎట్టకేలకు పట్టుబడినట్లు తెలిపారు. ఎస్వీయూ క్యాంపస్ లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. చిరుతను అటవీ సిబ్బంది ఎస్వీ జూపార్క్ కు తరలించారు. చిరుత సంచారంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు చాలా ప్లేసుల్లో బోన్లు ఏర్పాటుచేశారు. అయితే బోనులో చిక్కకుండా చిరుత తప్పించుకుంటుంది.
ఇటీవల ప్రధాన గ్రంథాలయం వెనుక భాగంలో ఒక జింక పిల్లపై చిరుత దాడి చేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో ఉదయం 7 గంటల లోపు, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరూ సంచరించవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిరుత బోనులో చిక్కింది. దీని వల్ల యూనివర్సిటీలో ఎవ్వరిపై దాడులు జరగలేదని తెలిపారు.