Manmohan Singh: ముగిసిన మన్మోహన్ అంత్యక్రియలు..చితికి ఎవరు నిప్పుపెట్టారంటే...!


Published Dec 28, 2024 04:25:00 PM
postImages/2024-12-28/1735383428_l13520241227102409.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి .ఢిల్లీలోని నిగంబోధ్ ఘూట్ లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పాడెను మోసారు. సిక్కు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. చితికి నిప్పు అంటించే ముందు ప్రార్ధనలను నిర్వహించారు. మన్మోహన్ చితికి తన కూతురు నిప్పు అంటించారు. సిక్కు సాంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలను చేశారు కుటుంబసభ్యులు. మన్మోహన్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో పాటు ఉప రాష్ట్రపతి ధన్కడ్ ,త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rahul-gandhi indian-army died manmohan-singh

Related Articles