ప్లాట్ పాం నెంబర్ల గజిబిజి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు అధికారులు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశ రాజధాని న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పోటెత్తారు. నిన్న జరిగిన ఈ తొక్కిసలాటలో పదులసంఖ్యలో దాదాపు 18 మంది చనిపోయారు. రైలు పేర్లు ఒకేలా ఉండడం తో పాటు ...ప్లాట్ పాం నెంబర్ల గజిబిజి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు అధికారులు. అయితే దీని కారణంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే స్టేషన్‌లలో రద్దీని నియంత్రించే ఉద్దేశంలో భాగంగా ప్రత్యేక హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైనట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్స్ పర్మినెంట్ రైల్వే హోల్డింగ్స్ పెట్టాలని పిక్స్ అయ్యింది రైల్వే శాఖ. ఇలా 60 స్టేషన్స్ లో హోల్డింగ్స్ పెట్టాలని పిక్స్ అయ్యింది.
ఈ ప్రమాదాలను నివారించడానికి రైల్వే శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సాయం తీసుకుంటున్నాడు. ప్రయాణికులు హోల్డింగ్ ప్రాంతాల వరకు వెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం గుర్తులు , హోల్డింగ్ ప్రాంతాలకు వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు.