peddi: పెద్ది గ్లింప్స్ వచ్చేసాయ్..రామ్ చరణ్ కొత్తసినిమా గ్లింప్స్ !

రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు పెద్ది ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా చరణ్ మాస్ రా లుక్ లో రామ్ చరణ్  హైలెట్ ఉన్నారు.


Published Apr 06, 2025 12:05:00 PM
postImages/2025-04-06/1743921442_hq720.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . గేమ్ ఛేంజర్ తర్వాత వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయింది. పాటలు కూడా రెడీ చేసేశారున రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు పెద్ది ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా చరణ్ మాస్ రా లుక్ లో రామ్ చరణ్  హైలెట్ ఉన్నారు.


ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది సినిమా నుంచి ఫస్ట్ షాట్ అని గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో ఒకే పని చేసేనాకి , ఒకేలా బతికేనాకి ఇంత పెద్ద బతుకు ఎందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నపుడే చేసేయ్యాల ..మళ్లీ పుడతామా ఏంటి అంటూ చరణ్ వాయిస్ తో డిఫరెంట్ సలాంగ్ లో డైలాగ్ అదగొట్టారు. ఈ సినిమా లో క్రికెట్ పోటీల మీద ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గ్లింప్స్ లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని మంచి షాట్ కొట్టాడు .రామ్ చరణ్ మాస్ లుక్  ఫ్యాన్స్ కి భలే ఆసక్తికరంగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 26 రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. జాన్వికపూర్ అందాలు ...రామ్ చరణ్ మాస్ లుక్ సినిమా పై మరింత అంచనాలు పెంచేలా చేస్తున్నాయి.



 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news ramcharan glimpse

Related Articles