కొండా సురేఖ మాటల్లో తప్పే లేదు

మంత్రి కొండా సురేఖ సినీ నటిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ మహిళగా,  మంత్రిగా ఉండి మరో మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు జనం


Published Oct 03, 2024 10:18:00 AM
postImages/2024-10-03/1727929237_sitakkakondajagareddy.jpg

మంత్రికి సపోర్టు చేస్తున్న కాంగ్రెస్ నేతలు

సినిమా వాళ్ల పాత్రను బట్టి చెప్పాం: సీతక్క

సురేఖను రెచ్చగొట్టొద్దు.. ఫైర్ బ్రాండ్: జగ్గారెడ్డి

న్యూస్ లైన్ డెస్క్: మంత్రి కొండా సురేఖ సినీ నటిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ మహిళగా,  మంత్రిగా ఉండి మరో మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు జనం సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కొండా సురేఖ చేసిన ఆరోపణలను సమర్ధిస్తున్నారు. ఆమె మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదంటూ వెనకేసుకొస్తున్నారు.

మంత్రి సీతక్క సైతం కొండా సురేఖ మాటలను సమర్ధించారు. పనిగట్టుకుని తాము సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని అన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుందని చెప్పారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినిమా ప్రముఖులపై మాత్రమే కొండా సురేఖ మాట్లాడారంటూ సీతక్క సమర్ధించుకొచ్చారు.  

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో తప్పే లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ మాటలను ఆయన సమర్ధించారు. అసలు మంత్రి కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ అని, ఆమెను రెచ్చగొట్టొదని అన్నారు. కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పి ఈ సమస్యను ఇంతటితో ఆపాలని జగ్గారెడ్డి అన్నారు.

newsline-whatsapp-channel
Tags : congress ktr cm-revanth-reddy nagarjuna samantha konda-surekha

Related Articles