అదానీతో పొంగులేటి భేటీ? సునీల్ కనుగోలు కూడా ప్రత్యక్షం!

ఐటీసీ కోహినూర్ హోటల్‌ లో ఓ కీలక భేటీ జరిగింది. పారిశ్రామికవేత్త అదానీతో కేబినెట్‌లో నెం.2 హోదాలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీ వెనక ఉన్న రహస్యం ఏంటన్నది


Published Oct 03, 2024 09:31:18 AM
postImages/2024-10-03/1727928078_ADANI.jpg

ఐటీసీ కోహినూర్ హోటల్ లో రహస్య మంతనాలు

ఎందుకీ భేటీ? దేనికోసం ఈ చర్చలు?

84 ఎకరాల విలువైన భూమిని అప్పగించే ప్రయత్నాలా?
కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

న్యూస్ లైన్ డెస్క్:ఐటీసీ కోహినూర్ హోటల్‌ లో ఓ కీలక భేటీ జరిగింది. పారిశ్రామికవేత్త అదానీతో కేబినెట్‌లో నెం.2 హోదాలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీ వెనక ఉన్న రహస్యం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మరో ముఖ్యవిషయం ఏంటంటే.. ఈ సమావేశంలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పేరున్న సునీల్ కనుగోలు పాల్గొనడం. ఇంతకూ సునీల్ కనుగోలుకు ఈ భేటీతో ఏం సంబంధం? ఆయనకు, భేటీలో పాల్గొన్న ప్రముఖులకు మధ్య ఎలాంటి చర్చ జరిగింది?  

అత్యంత విలాసవంతమైన ఐటీసీ కోహినూర్‌ హోటల్ లోని ప్రెసిడెన్షియల్ సూట్‌లో తెలంగాణ క్యాబినెట్‌లో నంబర్ 2గా పిలవబడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పారిశ్రామికవేత్త అదానీ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో కీలక అంశంపై చర్చ జరిగినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అదానీతో కాంగ్రెస్‌తో దోస్తీ కట్టాడా?

లేక రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతుందా అంటూ ఎక్స్ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాక ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఉండటంపై సందేహాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశానికి సునీల్ ఎందుకు హాజరయ్యాడని ట్వీట్‌లో ప్రశ్నించారు.

newsline-whatsapp-channel
Tags : news-line congress adani sunil ministerponguletisrinivasreddy

Related Articles