ఈ సానుకూల అంశాల మధ్య బంగారం ధరలు తగ్గే వీలు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధరలు రికార్డ్ స్థాయి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. మే వ తేదీ శనివారం బంగారం ధరలు భారీగానే తగ్గాయి. 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ. 98,340 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,140 పలికింది. ఈ మధ్య కాలమంతా బంగారం ధర లక్ష దాటింది. అమెరికా చైనా మధ్య నడుస్తున్నటువంటి వాణిజ్య చర్చలే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ సానుకూల అంశాల మధ్య బంగారం ధరలు తగ్గే వీలు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
పెట్టుబడిదారులు బంగారం పై కాకుండా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణంగా నిలుస్తుంటాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డు స్థాయికి వద్ద ఉన్నాయి. బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి మాత్రం ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా డిజిటల్ గోల్డ్ రూపంలోనే పెట్టుబడి పెట్టినట్లయితే ఎక్కువ రాబడి లభించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.