union budget: మిడిల్ క్లాస్ వారి కి తగ్గే పన్ను భారం ఇదే !

గ్రామీణప్రాంత ప్రజలు వలసలు పోకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్లాన్ చేశారు.


Published Feb 01, 2025 03:28:00 PM
postImages/2025-02-01/1738404007_4165663588.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నిర్మలాసీతారామన్  బడ్జెట్ లో మధ్యతరగతి వారిపై ఎక్కువ ప్రెజర్ పడకుండా ....గ్రామీణప్రాంత ప్రజలు వలసలు పోకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఇలా ప్రతి వర్గాన్ని బడ్జెట్ లో ఓ మెట్టు పైకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే బడ్జెట్ లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే..


* ప్రస్తుత ఆదాయపన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తాం. 


 * బిల్లులో సులభతర విధానం తీసుకురాబోతున్నాం


* వృద్ధులకు వచ్చే ఆదాయంపై వడ్డీని రూ.లక్షకు పెంచాం


* రూ.6 లక్షలలోపు అద్దెను ఆదాయపన్ను నుంచి మినహాయింపు


* క్యాన్సర్‌, తీవ్రవ్యాధులకు సంబంధించిన 36 ఔషధాలపై దిగుమతి సుంకం తొలగింపు


* దీనితో పాటు మరో ఆరు రకాల మందులపై ట్యాక్స్ ను రద్దు చేసే ఆలోచన కూడా ఉందని తెలిపారు . బల్క్‌ డ్రగ్స్‌ దిగుమతులపై సుంకం రద్దు. 


*  విద్యుత్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్లకు అవసరమైన లిథియం అయాన్‌ బ్యాటరీలకు అదనపు ప్రోత్సాహకాలు


* బీమా రంగంలో 74 శాతం నుంచి వంద శాతానికి ఎఫ్‌డీఐల పెంపు


* ద్వితీయశ్రేణి నగరాల్లో జీజీసీల ఏర్పాటుకు రాష్ట్రాలకు సహాయం


పండ్లు, కూరగాయల ఎగుమతులకు అవసరమైన ప్రత్యేక కార్గో సౌకర్యం


బీమా రంగంలో 74 శాతం నుంచి వంద శాతానికి ఎఫ్‌డీఐల పెంపు


ప్రీమియం మొత్తం ఇండియాలోనే ఉంచే సంస్థలకు ఈ వెసులుబాటు
 

IIT, IIS విద్యార్థులకు రూ.10 వేల కోట్ల స్కాలర్​షిప్స్​


షిప్‌ బిల్డింగ్‌ కోసం కొత్త ఎకో సిస్టమ్‌ ఏర్పాటు


ఐఐటీ, ఐఐఎస్‌ విద్యార్థులకు రూ.10 వేల కోట్ల ఉపకార వేతనాలు


జ్ఞానభారత మిషన్‌ ఏర్పాటు


మ్యూజియాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న పురాతత్వ ప్రతుల పునరుద్ధరణకు సాయం


ఎగుమతులు పెంచేలా ఎంఎస్‌ఎంఈ, వాణిజ్య శాఖల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu unionbudget budget2025-2026

Related Articles