భారతీయులు ఎక్కువమంది జ్యోతిష్య శాస్త్రాలని నమ్ముతారు. ముఖ్యంగా దాని ప్రకారమే ఏ పనైనా చేస్తారు. కోట్ల రూపాయల బిజినెస్ నుండి మొదలు చిన్న బిజినెస్ ల వరకు శాస్త్రం ప్రకారం, మంచి రోజులు, మన పేరు మీద
న్యూస్ లైన్ డెస్క్: భారతీయులు ఎక్కువమంది జ్యోతిష్య శాస్త్రాలని నమ్ముతారు. ముఖ్యంగా దాని ప్రకారమే ఏ పనైనా చేస్తారు. కోట్ల రూపాయల బిజినెస్ నుండి మొదలు చిన్న బిజినెస్ ల వరకు శాస్త్రం ప్రకారం, మంచి రోజులు, మన పేరు మీద కలిసి వస్తుందా లేదా అనే విషయాలు తెలుసుకుని మాత్రమే ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 2 అమావాస్య నుంచి సెప్టెంబర్ 18 వచ్చే పౌర్ణమి వరకు చంద్రుడితో పాటుగా శుక్రుడు, బుధుడు, రవి చాలా యాక్టివ్ గా ఉండబోతున్నారని తెలుస్తోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి జరగబోతుందట. మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
#1. వృషభ రాశి :
జాతక చక్రం ప్రకారం ఈ రాశి వారికి బుధ శుక్రుడితో సహా ఇతర గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయట. అంతేకాదు ఈ రాశి వారికి ఈ 15 రోజులలో రెండుసార్లు ధనయోగం కూడా పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరికి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయట. ఉద్యోగాలు చేసేవారైతే మంచి ప్రమోషన్ వచ్చి బాగా సంపాదిస్తారట. ఆరోగ్యం మెరుగుపరడమే కాకుండా వృత్తి వ్యాపారాలు కూడా పెరుగుతాయట.
#2. సింహరాశి:
ఈ రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నట్టు తెలుస్తోంది. వీరు మనసులో ఏది కోరుకున్న అది తప్పక నెరవేరుతుందట.ఆర్థిక సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారట. ముఖ్యంగా వృత్తి వ్యాపార రంగాలలో ముందుకెళ్తారని, కొత్త పరిచయాలు పెరుగుతాయట వారి వల్ల కూడా వీళ్ళకి లాభాలు ఉంటాయని అంటున్నారు.
#3. వృశ్చికం:
ఈ రాశి వారిలో దశమ లాభ స్థానాల్లో గ్రహాల సంచారం వల్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ వ్యవహారం అయినా సరే కలిసి వస్తుందట. ముఖ్యంగా ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మంచి స్థానంలోకి వెళ్తారట. ముఖ్యంగా విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంటుందని, సమాజంలో కీర్తి పటిష్టలు పెరుగుతాయట.
#4. మీనం:
ఈ రాశి వారికి కూడా గ్రహాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయని తెలుస్తోంది. ఈ రాశి వారికి బిజినెస్ బాగా కలిసి వస్తాయట, ఒకవేళ బిజినెస్ చేసే వారు అయితే లాభాల్లో దూసుకుపోతారట. జాబ్ ల కోసం ట్రై చేసే వారికి ఈనెల బాగా కలిసి వస్తుందట. ఇదివరకే జాబ్ చేస్తున్న వారైతే ప్రమోషన్ లభిస్తుందట. ఆరోగ్య సమస్యలు సెట్ అయిపోయి కుటుంబంతో హ్యాపీగా జీవిస్తారని పండిత నిపుణులు అంటున్నారు.