వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమై ఫిబ్రవరి 14న గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రేమికులకు ఎంతో ఇష్టమైన రోజు. అసలు పెళ్లి కాని వారి కంటే ప్రేమికుల రోజును పెళ్లైన జంటలే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఓ సర్వే చెబుతుంది. అయితే ఈ ప్రేమికుల రోజు ఎలా మొదలైందో ఎవరి కథను మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమై ఫిబ్రవరి 14న గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది.
రోమ్‌లో సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి ఉండేవాడు. ప్రపంచంలో మనుషులు ఆనందంగా బతకాలంటే ప్రేమ అవసరమని నమ్మాడు. ప్రేమను గురించి జనాలతో మాట్లాడేవాడు. కానీ, ఆ సమయంలో రోమ్ రాజు క్లాడియస్‌కు ప్రేమను ప్రోత్సహించడం నచ్చలేదు. వివాహం సైనికుల బలాన్ని, తెలివితేటలను ప్రభావితం చేస్తుందని అది వారిని యుద్ధంలో బలహీనపరుస్తుందని అతను నమ్మాడు. అందుకే ఆ రాజు పరిపాలన సైనికులకు పెళ్లి నిషిధ్ధం. రాజు ప్రేమకు ఎంత విరుధ్ధం అయినా ..ప్రేమికులను ప్రోత్సహిస్తూ ..ప్రేమ పెళ్లిళ్లు చేస్తూ వచ్చాడు.ఇది రాజుకు నచ్చక ...సెయింట్ వాలెంటైన్‌ను అరెస్టు చేసి, ఫిబ్రవరి 14, 269న అతనికి మరణశిక్ష విధించాడు.
మరో కథ కూడా ఉంది.సెయింట్ వాలెంటైన్ తాను జైలులో ఉన్న జైలర్ కుమార్తెతో ప్రేమలో పడ్డాడని, ఉరితీయడానికి ముందు, సెయిం ట్ వాలెంటైన్ జైలర్ కుమార్తెకు ఒక లేఖ రాశాడని, అందులో చివరలో ‘మీ వాలెంటైన్’ అని రాశాడని చెబుతారు. ఆ రోజు నుంచి ఫ్రిబ్రవరి నుంచి 14 ను ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు.