ఈ కార్టూన్ లో మోదీ చేతికి సంకెళ్లు వేసి ఉన్నాయి. నోరు మెదపని మోదీ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అక్రమంగా దేశం లో ఉంటున్న వలసదారులను వెనక్కిపంపుతుంది అమెరికా. ఇది అందరికి తెలిసిందే అయితే తిరిగి భారత్ కు పంపే క్రమంలో వారికి సంకెళ్లు వేసి పంపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెదవి విప్పకపోవడాన్ని ప్రశ్నిస్తూ తమిళనాడు డిజిటల్ మ్యాగజైన్ ‘వికటన్’ ఈ నెల 10న ప్రచురించిన కార్టూన్ తీవ్ర వివాదాస్పదమైంది. ఈ కార్టూన్ లో మోదీ చేతికి సంకెళ్లు వేసి ఉన్నాయి. నోరు మెదపని మోదీ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు మోదీ సంకెళ్లతో కూర్చున్నట్టుగా ఉన్న కార్టూన్‌ను ప్రచురించింది. ఇది ఒక రకంగా మోదీని అవమానించడమే అని కేంద్రం భావించింది ఈ విషయాన్ని తెలిపారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై ఈ నెల 15 న కేంద్రసమాచార మంత్రి ఎల్ . మురుగన్ కు , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ కు పిర్యాదు చేశారు. దీంతో గత రెండు రోజులుగా వికటన్ పోర్టల్ ప్రసారాలను నిలిచిపోయాయి.