బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి పైసలు వేస్ట్ ..!


Published Feb 17, 2025 11:26:52 AM
postImages/2025-02-17/1739771812_WhatsAppImage20250217at11.07.56AM.jpeg

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి
పైసలు వేస్ట్ 
ఆ హామీ మాది కాదు 
మోడీ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టలేడు కదా
బయ్యారంలో దొరికేది నాసిరకం ఐరన్ 
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏడాది పాలనలో కాంగ్రెస్‌పై పూర్తి వ్యతిరేకత
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం
రానున్న కాలంలో కాంగ్రెస్‌కి గడ్డుకాలం
హన్మకొండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణం, హన్మకొండ  (ఫిబ్రవరి 16): బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని బీజేపీ ఎప్పడు హామీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఏపీ, తెలంగాణ విభజన హామీలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కానీ మేము ఇస్తామని చెప్పలేదని వెల్లడించారు. బయ్యారంలో దొరికే ఐరన్ చాలా నాసిరకమైనదని, మనం స్టీల్‌ని ఉత్పత్తి చేయలేమని పేర్కొన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మోడీ ఇంట్లో నుండి తీసుకొచ్చి పెట్టలేడు కదా? అని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృధా అవుతాయని పేర్కొన్నారు. 

ఇక ఏడాది పాలనలో కాంగ్రెస్ పై పూర్తి వ్యతిరేకత వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, కాంగ్రెస్ పై అన్ని వర్గాల ప్రజలు నిరాశతో ఉన్నారని తెలిపారు. దేశంలో ఏ సీఎం చేయనట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్లి హాజరు వేయించుకుని వస్తున్నారని విమర్శించారు. ఖచ్చితంగా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం వస్తుందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయట తిరగలేని పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు రూ.2500 సాయం,  పింఛన్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఫీజు రియింబర్స్‌మెంట్స్, రుణమాఫీ ఇలా ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. 

మరోవైపు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బీసీ కులగణన వాస్తవంగా ఉందని ఏ ఒక్కరు చెప్పడం లేదని అన్నారు. బీసీ సంఘాలు.. ఈ సర్వేని సమర్దిస్తే కేంద్రంని ఒప్పించి ఆమోదం చేపిస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రాబోతున్నాడని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గంతంగా సంబంధాలు ఉన్నాయని, బీఆర్ఎస్  తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టేందుకు బయపడుతున్నారని విమర్శించారు.

newsline-whatsapp-channel
Tags : congress telanganam ap kishan-reddy

Related Articles