ప్రస్తుత కాలంలో చాలామంది మోడ్రన్ లైఫ్ అలవాటు పడ్డారు. కూర్చున్న కాడికే అన్నీ రావాలి. దీనివల్ల కనీసం శరీరానికి శ్రమ ఉండకుండా పోతుంది. దీంతో చాలామంది అనేక రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఇంట్లో ఉపయోగిస్తున్నారు. ఇది మనకు ఎంత మేలు చేస్తుందో, దానికి 100 రేట్లు హాని కూడా చేస్తాయి. అయితే తాజాగా ఒక ఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. ఒక ఇంట్లో గీజర్ వాడకంలో జాగ్రత్త వల్ల ఫ్యామిలీకి ఫ్యామిలి మరణించింది.
న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో చాలామంది మోడ్రన్ లైఫ్ అలవాటు పడ్డారు. కూర్చున్న కాడికే అన్నీ రావాలి. దీనివల్ల కనీసం శరీరానికి శ్రమ ఉండకుండా పోతుంది. దీంతో చాలామంది అనేక రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఇంట్లో ఉపయోగిస్తున్నారు. ఇది మనకు ఎంత మేలు చేస్తుందో, దానికి 100 రేట్లు హాని కూడా చేస్తాయి. అయితే తాజాగా ఒక ఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. ఒక ఇంట్లో గీజర్ వాడకంలో జాగ్రత్త వల్ల ఫ్యామిలీకి ఫ్యామిలి మరణించింది.
హైదరాబాదులోని సనత్ నగర్ కు చెందినటువంటి ఈ ఫ్యామిలీ గీజర్ నుంచి విడుదలైనటువంటి కార్బన్ మోనాక్సైడ్ వాయువులను పీల్చుకొని ఆపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించినట్లు తెలుస్తోంది. అలాంటి గీజర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా వాటర్ హీట్ అవ్వడం కోసం గీజర్ ని ఉపయోగిస్తారు. దీనికి కరెంటు కనెక్షన్ ఇవ్వడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట. లేదంటే షాక్ తగిలి మరణించే అవకాశం ఉంది.. గ్యాస్ గీజర్ లో బ్యూటనాల్, ప్రోపనాల్ అనే వాయువులు ఉంటాయి.
ఇవి గాలిలో కార్బన్ మోనాక్సైడ్ లాంటి హానికరమైన వాయువులను విడుదల చేస్తాయి. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు ఏర్పడి తలనొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. మన బాత్రూంలో గీజర్ అమర్చేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా అమర్చుకోవాలి. దీనివల్ల ఏమైనా విషవాయులు బయటకు వెళ్లేలా చేస్తుంది. ముఖ్యంగా వానాకాలంలో గీజర్ ఆన్ లో ఉండగా స్నానం చేయకూడదు. వీలైతే ఆ నీటిని బకెట్ లో నింపుకొని గీజర్ ఆఫ్ చేసి స్నానానికి వెళ్ళాలి. వీటన్నింటికంటే ఎలక్ట్రికల్ హీటర్లను పక్కనపెట్టి న్యాచురల్ గా వాటర్ వేడి చేసుకుని స్నానం చేయడం మరింత మంచిదని నిపుణులు అంటున్నారు.