rohit sharma: టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ !

ఈ టైంలో రోహిత్ టెస్ట్ మ్యాచ్ కు గుడ్ బై చెప్పేశాడు. ఇది ఫ్యాన్స్ కే కాదు ..క్రికెట్ వర్గాలకు కూడా షాకింగ్ గా అనిపించింది.


Published May 08, 2025 12:27:00 PM
postImages/2025-05-08/1746687540_rohitsharmat20wc202405866b39c4037eb7d376c70ba2c31d6c901024x576.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :   టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు . టెస్టులకు గుడ్ బై చెప్పాలన్న రోహిత్ నిర్ణయం అభిమానులకు కచ్చితంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. వచ్చే నెలలో ఇంగ్లాండ్ లో జరిగే మ్యాచ్ కు కూడా రోహిత్ ఆడనట్టే . అయితే ఇంగ్లాండ్ మ్యాచ్ రోహిత్ నడిపిస్తాడనుకున్నారంతా...కాని కొన్నిరోజుల ముందే ఈ పర్యటన కోసం బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ టైంలో రోహిత్ టెస్ట్ మ్యాచ్ కు గుడ్ బై చెప్పేశాడు. ఇది ఫ్యాన్స్ కే కాదు ..క్రికెట్ వర్గాలకు కూడా షాకింగ్ గా అనిపించింది.


రోహిత్ శర్మకు ప్రస్తుతం 38ఏళ్లు. 2013లో వెస్టిండీస్ పై టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. 12ఏళ్ల కెరీర్ లో 67 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ.. 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. వీటిలో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 2019 లో దక్షిణాఫ్రికా జట్టుపై 212 పరుగులు చేశాడు.


రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ‘‘రోహిత్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. గొప్ప ఆటగాడు ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కు ఏదో ఒక దశలో ఆటను వదలాలి. రోహిత్ టెస్ట్ కెరియర్ చాలా గొప్పగా సాగింది. ఇక పై వన్డేల్లో , ఐపీఎల్ లో కొనసాగుతాడు . నేను బీసీసీఐలో ఉన్నపుడే రోహిత్ కెప్టన్ అవుతాడని అనుకున్నారు. కెప్టెన్ గా టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. టెస్టుల్లోనూ జట్టుకు అనేక విజయాలు అందించాడు.’’ అని గంగూలీ పేర్కొన్నాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu test-match rohit-sharma

Related Articles