దీంతో ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతో వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు రసవత్తంగా మారుతున్న టైంలో ప్లేయర్స్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం దీంతో ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతో వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.
ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సరైంది కాదనపించిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే , పంజాబ్ , ఢిల్లీ మ్యాచ్ భద్రతా కారణాల రీత్యా మధ్యలోనే రద్దు చేయగా, శుక్రవారం లఖ్‌నవూ - ఆర్సీబీ మధ్య లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. టోర్నీని ప్రస్తుతానికి మాత్రమే వాయిదా వేస్తున్నప్పటికి తిరిగి పునఃప్రారంభిస్తారనేది బీసీసీఐ అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుత సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచులు ఉన్నాయి.
భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ధర్మశాలలో ఉన్న పంజాబ్ , ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ ను సేఫ్ గా ఢిల్లీకి తరలించేందుకు ఫస్ట్ స్పెషల్ ట్రైన్ ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. వందేభారత్ లో తరలించేందుకు సిద్దమైంది. ఆ రైలు వెళ్లేందుకు రైల్వేశాఖ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. బస్సులో ఢిల్లీ చేర్చాలనుకుంటుంది.