T20 Worldcup: టాస్ గెలిచి ఆసీస్‌.. భారత్‌తో ఫైనల్ ఫైట్! 2024-06-24 19:47:26

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 వరల్డ్ క‌ప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న‌ టీమిండియాకు సువ‌ర్ణావ‌కాశం దొరికింది. ఐసీసీ టోర్నీల్లో ఫెవరెట్‌గా మారిన ఆస్ట్రేలియాను ఇంటికి పంపే మంచి అవకాసం రోహిత్ సేనకు వచ్చింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఆస్ట్రేలియాను సాగ‌నంపేందుకు భారత్ సిద్ధమైంది. సూప‌ర్ 8 చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య డారెన్ సామీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లు చావోరేవో తేల్చుకోనుంది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరు కీలకంగా మారనుంది. నిరుడు టెస్టు గ‌దతో పాటు వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని త‌న్నుకుపోయిన కంగారుల‌పై బ‌దులు తీర్చుకునే సమయం ఇప్పుడు భారత్‌కు దొరికింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా, ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తుంది. 

జట్టు వివరాలు:

భార‌త జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్ (వికెట్ కీప‌ర్), సూర్య‌కుమార్ యాద‌వ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా జ‌ట్టు : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్న‌ర్, మిచెల్ మార్ష్(కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్క‌స్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీప‌ర్), ప్యాట్ క‌మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, హేజిల్‌వుడ్.