Aisa Cup: థాయిలాండ్‌పై బంగ్లా సూపర్ విక్టరీ..!

మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్ టోర్నీ‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్, థాయిలాండ్ జట్ల మధ్య రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఘన విజయం సాధించింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721666504_bangla.jfif

థాయిలాండ్‌పై బంగ్లా సూపర్ విక్టరీ..!
హాఫ్ సెంచరీతో చెలరేగిన ఖతున్
దిలారా అక్టర్ తుఫాన్ ఇన్నింగ్స్‌
రబెయా ఖాన్ బౌలింగ్ షో


న్యూస్ లైన్ స్పోర్ట్స్:  మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్ టోర్నీ‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్, థాయిలాండ్ జట్ల మధ్య రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఓపెనర్ ముర్షిదా ఖతున్ హాఫ్ సెంచరీతో చెరరేగగా.. దిలారా అక్టర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో థాయిలాండ్ బౌలర్లకు ఊచకోత చూపించింది. దీంతో బంగ్లాదేశ్, థాయిలాండ్ పై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన థాయిలాండ్ మహిళ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అఫీసర సువంచోంరతి(6)ను రబెయా ఖాన్ వెనక్కి పంపింది. ఆ తర్వాత క్రీజులో దిగిన నన్నపట్ కొంచరోయెంకై(0), ఫన్నిత మాయ(3), చనిదా సుత్తిరువాంగ్(8), సువనన్ ఖియాతో(3) బ్యాటింగ్‌లో నిరశా పరిచారు. దాంతో థాయిలాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 20 రన్స్ కొట్టింది. ఇక ఓవైపు వికెట్లు పడుతున్న బంగ్లా బౌలర్లను దీటుగా ఎందుర్కొంటూ నట్టయా బూచతం స్కోర్ బోర్డును ముందుకు నడిపింది. బౌండరీలు కొడుతూ కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరో బ్యాటర్ సులీపోర్న్ లావోమి ధనాధన బ్యాటింగ్ చేసింది. ఇక ఈ ఇద్దకు  కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. అయితే సబికున్ నహర్ బౌలింగ్‌లో భారీ ష్టార్ అడబోయే క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఆ తర్వాత బూచతం(40) కూడా పెవిలియన్‌కు చేరింది. చివరిలో రోసెనన్ కనోహ్(13) మెరుపు బ్యాటింగ్ చేసింది. దాంతో థాయిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు రబెయా ఖాన్ నాగులు వికెట్లతో థాయిలాండ్ బ్యాటర్లపై విరుచుకుపడగా.. రీతు మోని, సబికున్ నహర్ చెరో రెండు వికెట్లు తీశారు.   

స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టుకు మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్లు దిలారా అక్టర్, ముర్షిదా ఖతున్ ధనాధన బ్యాటింగ్ చేశారు. అయితే అక్టర్(17), చనిద సుత్తిరువాంగ్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇష్మా తంజిమ్ ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో పడింది. మరోపైపు ఖతున్ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ థాయిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. దాంతో ఖతున్( 43 బంతుల్లో 52 పరుగులు 8 ఫోర్లు, 1 సిక్సర్) సహాయంంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అటూ తంజిమ్ కూడా తుఫాన్ బ్యాటింగ్ చేసింది. ఈ జోడి కలిసి బంగ్లా స్కోర్ బోర్డుకు 70 రన్స్ జతచేశారు. అయితే తంజిమ్(16)ను తిపట్చా పుట్టావోంగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ కాసేపటీకే ఖతున్(50) కూడా ఔట్ అయ్యింది. దాంతో బంగ్లా మూడు వికట్లు కోల్పోయి 85 రన్స్ కొట్టింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రీతు మోని(9), రుమానా అహ్మద్(5) మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక వీళ్లందరూ క్రీజులో నిలబడి బంగ్లాదేశ్‌ జట్టు భారీ విజయాన్ని అందించారు. దాంతో బంగ్లా, థాయిలాండ్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.  

newsline-whatsapp-channel
Tags : telangana won-the-match

Related Articles