KTR: పార్టీ విలీన వార్తలపై కేటీఆర్ స్పందన.. ఆ మీడియాకు హెచ్చరిక

బీఆర్ఎస్ పార్టీపైన విలీనం అంటూ దుష్ప్రచారం చేస్తున్న మీడియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.


Published Aug 07, 2024 04:58:40 AM
postImages/2024-08-07/1723023468_ktr2222.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీపైన విలీనం అంటూ దుష్ప్రచారం చేస్తున్న మీడియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కావాలనే ఇలాంటి ప్రాపగండా, ఎజెండా వార్తలు ప్రచారం చేస్తున్నారని..  ఈ విషయంపై ప్రచారం చేసిన వ్యక్తులు, మీడియా సంస్థలు సరైన వివరణ ఇవ్వకుంటే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.

 

24 ఏళ్లుగా అనేక కుట్రలు, కుతంత్రాలను దాటుకొని బీఆర్ఎస్ ఈ స్థాయికి వచ్చందని.. పట్టుదలతో పోరాడి రాష్ట్రాన్ని సాధించామని కేటాఆర్ అన్నారు. సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి.. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయ పదాలుగా మార్చుకొని పరిపాలించామని అన్నారు. కోట్లాది గొంతుకలు, గుండెల ఆత్మగౌరవ నినాదం తెలంగాణ.. బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ నిలబడుతుందని.. కలబడుతుందని.. పోరాటాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే పోరాటాల పార్టీ అని.. జాతీయపార్టీలకు ముందు సాగిల పడే పార్టీ కాదని కేటీఆర్ అన్నారు. పడుతాం.. లేస్తాం.. తెలంగాణ కోసం పోరాడుతాం అంతే కానీ తల వంచమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేసే ఆలోచన మానుకోవాలని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు.

 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress ktr bjp cm-revanth-reddy

Related Articles