ఈ విజయంతో బెంగాల్ టైగర్స్ టేబుల్ టాపర్ గా సెమీస్ కు చేరుకుంది. సెమీస్ కు చేరాలంటే తెలుగు వారియర్స్ తప్పకుండా గెలవాల్సిందే
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2025 సీజన్ లో తెలుగు వారియర్స్ కథ ముగిసింది. బెంగాల్ టైగర్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ అక్కినేని అకిల్ సింగిల్ హ్యాండ్ తో పోరాటం చేసినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఈ విజయంతో బెంగాల్ టైగర్స్ టేబుల్ టాపర్ గా సెమీస్ కు చేరుకుంది. సెమీస్ కు చేరాలంటే తెలుగు వారియర్స్ తప్పకుండా గెలవాల్సిందే . కాని ఆదివారం సూరత్ వేదికగా బెంగాల్ టైగర్స్ తో తలపడి ..ఓడిపోయింది.
అఖిల్ ఒంటరి పోరాటం..రెండో ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ బ్యాటర్లు తడబడ్డారు. అశ్విన్ బాబు, సామ్రాట్‌లు డకౌట్లు కాగా.. సాంబ (4), తమన్ (18), సచిన్ (12), ఆదర్శ్ (1)లు విఫలం అయ్యారు. దీంతో వారియర్స్ ఓటమి ఖాయమైంది. అయితే.. కెప్టెన్ అఖిల్ (91) సిక్సర్లు, ఫోర్లతో ఒంటరి పోరాటం చేశాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో అంటే 6 బంతుల్లో 42 పరుగులు స్థితిలో వారియర్స్ నిలిచింది.రెండో ఇన్నింగ్స్‌లో వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిందిఈ ఓటమితో టోర్నీ నుంచి తెలుగు వారియర్స్ నిష్క్రమించగా, ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన బెంగాల్ టైగర్స్ సెమీస్ చేరుకుంది.