భారత్ విన్నింగ్ ఛాన్సులు తగ్గించేలా ...కాస్త వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరుగుతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ తో టీమ్ ఇండియా ఈ టోర్నమెంట్ లో తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ కోసం భారీ ప్రణాళికలను రెడీ చేసుకున్నాడు. దుబాయ్ లో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. అందుకు జట్టులో ఐదుగురు స్పిన్నర్స్ ను చేర్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్స్ ను ఫీల్డింగ్ కూడా చేయించాలనుకుంటున్నాడట. నేచురల్ గా దుబాయ్ కాస్త పొడి వాతావరణం కాని ఇప్పుడు భారత్ విన్నింగ్ ఛాన్సులు తగ్గించేలా ...కాస్త వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
దుబాయ్‌లో వర్షం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఫిబ్రవరి 18న వర్షం పడింది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మేఘాలు రావడంతో ..రోహిత్ ప్లాన్ ఫ్లాప్ అవుతుందంటున్నారు క్రికెట్ ఎక్స్ పర్టర్స్ . ఎందుకంటే రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్‌లోకి కేవలం ముగ్గురు మెయిన్ పేసర్లతోనే అడుగుపెట్టాడు అతను ఐదుగురు స్పిన్నర్లకు ఈ మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చాడు. జట్టులో ఉన్న మహ్మద్ షమీ ఇంకా మంచి ఫామ్ లో కనిపించడం లేదు. కాగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు పెద్దగా అనుభవం లేదు. హార్దిక్ పాండ్యా జట్టులో నాల్గవ పేసర్ కాకపోతే తను ఆల్ రౌండర్.