ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌తో కలిసి ఏఐ ఆధారిత మీడియా కంపెనీ (ఏఐ స్టూడియో)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ తన అధికారిక " ఎక్స్ " ఖాతాలో మంగళవారం సాయంత్రం " బోల్డ్...బిగ్ ..బియాండ్ ఇమాజినేషన్ అంటూ ఓ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే . అయితే ఈ రోజు ఉదయంఎస్ వీసీ ఓ ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ చేసింది.
ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌తో కలిసి ఏఐ ఆధారిత మీడియా కంపెనీ (ఏఐ స్టూడియో)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ కోసం స్పెషల్ గా క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ ను డవలప్ చెయ్యడానికి అందించడానికి ఈ ఏ ఐ స్టూడియో పనిచేస్తుందని తెలిపారు. ఈ సంస్థ పేరు డీటైల్స్ అన్ని మే 4 న ప్రకటిస్తామని తెలిపారు. ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు భారతీయ సినిమా పరిణామ క్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా దిల్ రాజు జోడించారు.