HOLI COLOURS: కాస్త ట్రై చేస్తే ఇంట్లోనే బోలెడు రంగులు !

వేడుక లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎప్పుడు మనల్ని చాలా ఇబ్బందులు పెడతాయి.  అవి కంట్లో పడితే ..కళ్లు ఎఫెక్ట్ అవుతాయి.


Published Mar 13, 2025 10:53:00 PM
postImages/2025-03-13/1741886732_HowtomakeNaturalcolours.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆర్టిఫిషియల్ కలర్స్ కు నో చెప్పండి...చక్కగా కలర్ ఫుల్ గా నేచురల్ రంగులు ట్రై చెయ్యండి. రేపే హోలీ ...జీవితం రంగుల మయం కావాలని కోరుకుంటూ రంగురంగులు పూసుకుంటారు. భలే సరాదా పండుగ. అంతే జాగ్రత్తగా ఉండాల్సిన పండుగ. వేడుక లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎప్పుడు మనల్ని చాలా ఇబ్బందులు పెడతాయి.  అవి కంట్లో పడితే ..కళ్లు ఎఫెక్ట్ అవుతాయి.


పసుపు : పసుపులో కాస్తంత శనగ పిండి కలిపితే సెట్ అయిపోతుంది. లేతగా కావాలంటే కొద్దిగా బియ్యం పిండిని కలిపితే చాలు. ఇవి తడి చేసి రాసినా మీ స్కిన్ కు చాలా మంచిది. 


ఆరంజ్‌ : కమలాఫలం తొక్కల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే ఆరంజ్ కలర్ వచ్చేసినట్లే. కాస్త ముదురు రంగు కావాలనుకుంటే దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇవి సూపర్ రెమిడీ మీ స్కిన్ కి స్రబ్బర్ లా కూడా పనిచేస్తుంది. మీకు డ్రై లో అవైలబుల్ లేకపోతే ...ఫ్రెష్ వి మిక్సీ చేసుకొండి. మీరు ఎంజాయ్ చెయ్యడానికి బెస్ట్ ఇవి.


ఎరుపు : ఎర్ర మందారాలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమానికి తగ్గట్లుగా కొంత బియ్యం పిండి, కుంకుమపువ్వు కలిపితే సరి.


ఆకుపచ్చ...ఆకుల్ని తెచ్చి బాగా ఎండబెట్టాలి. వాటిని మిక్సీ పట్టుకుంటే మెత్తటి స్పర్శతో ఆకుపచ్చటి రంగు తయారవుతుంది.
గులాబీ : ముదురు, లేత గులాబీ పువ్వుల రేకులను బాగా ఎండబెట్టి మెత్తటి పొడిగా రుబ్బుకుంటే ఆ రంగు దొరికినట్లే. ట్రై చెయ్యండి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style home

Related Articles