ODI Match: సఫారీపై టీమిండియా ఘన విజయం..!

 సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది.


Published Jun 23, 2024 08:46:44 PM
postImages/2024-06-23/1719155804_srmiti.jfif

సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్‌..!
సఫారీపై టీమిండియా ఘన విజయం
హాఫ్ సెంచరీతో చెలరేగిన మంధన 
హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నాక్
3-0 తేడాతో సిరీస్ కైవసం 

న్యూస్ లైన్ స్పోర్ట్స్: సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది. టీమిండియా మహిళ బ్యాటర్ స్మృతి మంధన హాఫ్ సంచరీతో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించగా.. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నాక్‌తో ఔరా అనిపించింది. దాంతో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్టుపై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో 3-0 తేడాతో సౌతాఫ్రికాను క్లీన్‌స్వీప్‌ చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ లారా వోల్వార్డ్‌, తాజ్‌మీన్ బ్రిట్స్ దూకుడు బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఇక వోల్వార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడింది. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. మరో ఎండ్‌లో బ్రిట్స్ ‌కూడా మంచి బ్యాటింగ్‌ చేసింది. ఈ జోడి స్కోర్ బోర్డుకు 90 పరుగులు జతచేశారు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న బ్రిట్స్(38) రనౌట్ అయ్యింది. ఆ తర్వాత కెప్టెన్ లారా(61), అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో క్వాట్ అండ్ బౌల్డ్ అయ్యింది. తర్వాత క్రీజులో దిగిన బ్యాటర్స్ మారిజానే కాప్(7), అన్నేకే బోష్(4), సునె లుస్‌(13) పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో నిరశా పరిచారు. దీంతో సౌతాఫ్రికా జట్టు ఐదు వికెట్ల కోల్పోయి 120 రన్స్ చేసింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన నాడిన్ డి క్లర్క్, నొందుమిసో షాంగసే ధనాధన బ్యాటింగ్ చేశారు. ఈ జోడి భారత బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు, సిక్సర్లు రాబట్టించారు. ఈ ఇద్దరు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే నాడిన్(26), దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ కాసేపటికే  షాంగసే(16) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. దీంతో సఫారీ మీడిల్ ఆర్డర్ 180 పరుగుల వద్ద కుప్పకూలింది. ఇక చివరిలో మైకే డి రిడర్ ఓ మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడింది. రిడర్(26) అద్భుతమైన బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా జట్టు 200 మార్క్ స్కోర్‌ను దాటింది. దాంతో సఫారీ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు  అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టాగా.. శ్రేయాంక పాటిల్, పూజా డ్రెస్ మేకర్ చెరో వికెట్ తీశారు.


216 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన టీమిండియా జట్టుకు ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధన సాలిడ్ స్టార్ట్ అందించారు. స్మృతి మంధన, షఫాలీ ఇద్దరు మంచి ఇన్నింగ్స్‌ ఆడారు. అయితే షఫాలీ(25)ను తుమీ సెఖుఖునే పెవిలియన్‌కు పంపింది. తర్వాత బ్యాటింగ్‌కు ప్రియా పునియా వచ్చింది. మంధనతో కలిసి ఓ కీలక భాగస్వామ్యాని నెలకొల్పింది. ఈ ఇద్దరు భారత స్కోర్ బోర్డుకు 50 పరుగులు జోడించారు. స్మృతి వేగంగా పరుగులు చేస్తూ ఫిఫ్టి పూర్తి చేసుకుంది. అయితే ప్రయా(28), ఆయబొంగ ఖాకా బౌలింగ్‌లో భారీ షార్ట్ అడబోయి అన్నేకే బోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో టీమిండియా మూడు వికెట్లు కోల్పొయి 120 రన్స్ చేసింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీతి కౌర్, సఫారీ బౌలర్లకు ఊచకోత చూపించింది. బౌండరీలు, సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు మంధన అచితుచి ఆడుతూ 90 (83 బంతుల్లో 11 ఫోర్లు, 90 పరుగులు)లో చేరుకుంది. కానీ నన్‌కులేకో మ్లాబా ఓవర్‌లో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. దాంతో స్మృతి అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత జెమిమా రోడ్రిగ్స్ క్రీజులో దిగింది. కెప్టెన్ హర్మన్‌తో కలిసి హార్డ హిటింగ్ బ్యాటింగ్ చేసింది. ఇక ఈ జోడి నిలకడగా ఆడుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. దాంతో భారత్, దక్షిణాఫ్రికా జట్టుపై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీతో క్లీన్‌స్వీప్‌ చేసింది. సఫారీ బౌలర్లు తుమీ సెఖుఖునే, ఆయబొంగ ఖాకా, నన్‌కులేకో మ్లాబా తలా వికెట్ తీశారు.

newsline-whatsapp-channel
Tags : india-women south-africa won-the-match odi-match

Related Articles