జడేజా తన ఓవర్ల కోటాను పూర్తి చేయగానే కోహ్లీ పరుగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకోవడంతో, జడేజా వీడ్కోలు అంటూ వీడియోలు తెగ వైరల్ చేసేశారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: జడేజా రిటైర్మెంట్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై జడేజా రియాక్ట్ అయ్యారు. ఏంటి నా రిటైర్మెంటా ..నాకేం తెలీదే ...ఎందుకు ఇలాంటి నిరాధారమైన వార్తలు పుట్టిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా చిరాకు పడ్డారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జడేజా తన ఓవర్ల కోటాను పూర్తి చేయగానే కోహ్లీ పరుగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకోవడంతో, జడేజా వీడ్కోలు అంటూ వీడియోలు తెగ వైరల్ చేసేశారు. అంతేకాదు ...తన వల్ల అయినంత వరకు వన్డేలు ఆడతానని చెప్పుకొచ్చారు.
గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ట్వంటీ20లకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఈ ముగ్గురు ఆటగాళ్లు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని రోహిత్ శర్మ ఇదివరకే ఖండించారు. ఇప్పుడు జడేజా కూడా తన రిటైర్మెంట్ పై ఇవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు.