Rahul Dravid: చేతికర్రల సాయంతో నడుస్తున్న ద్రవిడ్ !

ఐపీఎల్ సీజన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ హెచ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ సన్నద్దతలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు మైదానంలో చెమటోడుస్తున్నారు.


Published Mar 13, 2025 02:28:00 PM
postImages/2025-03-13/1741856362_RahulDravid.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మాజీ క్రికెటర్ , టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయపడ్డారు. కొడుకుతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గాయపడడంతో మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు. కాలికి గాయం కావడంతో డాక్టర్లు పట్టా వేశారు. దీంతో ద్రవిడ్ చేతికర్రల ఊతంతో నెమ్మదిగా నడుస్తున్నాడు . కాగా త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ హెచ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ సన్నద్దతలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు మైదానంలో చెమటోడుస్తున్నారు.


తాజాగా బుధవారం క్యాంప్ లో ప్రత్యక్షమైన ద్రవిడ్ ను చూసి ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ద్రవిడ్ కాలికి పెద్ద బ్యాండేజీ ఉండడం తో పాటు చేతికర్రల సాయంతో అతికష్టం మీద నడుస్తుండడం చూసి టెన్షన్ పడుతున్నారు. కాలికి పట్టీతో ఓ కుర్చీలో కూర్చున్న ద్రవిడ్ ఫొటో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


బెంగుళూరు విజయ క్రికెట్ క్లబ్ తరుపున రాహుల్ గాంధీ మ్యాచ్ లో పాల్గొన్నాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రూప్ 3 సెమీఫైనల్ మ్యాచ్ లో ద్రవిడ్ తన కొడుకు అన్వయ్ తో కలిసి ఆడాడు. 28 బంతులు ఆడిన ద్రవిడ్ 29 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వికెట్ల మధ్య పరుగులు తీస్తుండగా నొప్పితో బాధపడ్డాడు. నొప్పి ఎక్కువ గా ఉండడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ట్రీట్‌మెంట్ తర్వాత తాజాగా రాజస్థాన్ క్యాంప్‌కు హాజరయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rahul bengalore

Related Articles