నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా అధ్భుతంగా హిట్ అయ్యింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కాంతార చాప్టర్ 1 షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అయితే ఈ షూట్ కి వెళ్తున్న జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలయ్యాయి. ‘ రిషబ్ శెట్టి వాళ్ల గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా అధ్భుతంగా హిట్ అయ్యింది.
ఆఖరి అరగంట మనల్ని ఆధ్యాత్మిక లోకంలో విహరింప జేసాడు. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న సినిమా . ఈ సినిమాకు చాలా అవార్డులు కూడా వచ్చాయి.గత కొద్ది రోజులుగా కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాంతార చాప్టర్ 1లో నటిస్తున్న ఆర్టిస్టుల బస్సు కర్ణాటక కొల్లూరు సమీపంలోని జడ్కల్ సమీపంలో బోల్తా పడింది. బస్సులో ఇరవై మంది ఉన్నారు.
వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే సినిమా అనుకోని కష్టాలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ అటవీశాఖ అధికారులు నోటీసులు ఇఛ్చి షూటింగ్ ఆపేశారు. 20 వేల చెట్లు కొట్టేశారని అందుకే షూటింగ్ ఆపేసినట్లు కూడా తెలిపారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా 15 కోట్లతో వచ్చిన ‘కాంతార’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లను వసూళ్లు చేసింది. కాంతార లో చూపించిన కథను కంటిన్యూ చేస్తూ చాప్టర్ 1 టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వస్తుంది.