ఇప్పటి వరకు టెస్టులో 9,230 రన్స్ చేసిన కొహ్లీ ,2011లో వెస్ట్ ఇండీస్‌తో అరంగేట్రం చేశాడు. కాగా, 3 జనవరి 2025న ఆస్ట్రేలియాతో విరాట్ కోహ్లీ చివరి టెస్టు ఆడాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ షాకింగ్ న్యూస్ అనౌన్స్ చేశారు. టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఇన్ స్టా లో తన ఫీలింగ్స్ ను పోస్ట్ చేస్తూ తన రిటైర్మెంట్ సంగతి చెప్పుకొచ్చాడు. కొహ్లీ 14 ఏళ్ల పాటు భారత్ తరుపున టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ తన కెరీర్ లో 123 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. ఇప్పటి వరకు టెస్టులో 9,230 రన్స్ చేసిన కొహ్లీ ,2011లో వెస్ట్ ఇండీస్‌తో అరంగేట్రం చేశాడు. కాగా, 3 జనవరి 2025న ఆస్ట్రేలియాతో విరాట్ కోహ్లీ చివరి టెస్టు ఆడాడు.
"టెస్ట్ క్రికెట్లో నేను తొలిసారి బ్యాగీ బ్లూ దుస్తులు ధరించి 14ఏళ్లు అయింది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఈ ప్రయాణంలో తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. చాలా పరీక్షలు పెట్టింది. నన్ను నేను తీర్చిదిద్దుకునేలా చేసింది. జీవితాంతం నేను ఏం పాటించాలో నేర్పింది. తెల్లని బట్టల్లో ఎంతో దాగి ఉంటుందనేది నేర్పింది. బయటకి కనిపించని ఎన్నో విలువైన క్షణాలు నాకు చాలా ఉన్నాయి. ఈ ఫార్మాట్ నుంచి దూరం వెళ్లడం అంత సులువైన విషయం కాదు. కాని నా నిర్ణయం సరైనదే. చాలా సంతృప్తితో నేను ఈ పార్మెట్ నుంచి వెళ్లిపోతున్నా నాతో ఈ ప్రయాణంలో ఉన్న ప్రతి స్నేహితుడికి..నా అభిమానులకు ధన్యవాదాలు . నా కెరియర్ నాకు చాలా ఆనందానిచ్చింది.ప్రేమతో ఇక #269, సైనింగ్ ఆఫ్" అని కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు.