పార్క్ సఫారీలో యానిమల్స్ ను చూడడానికి ప్రయాణిస్తున్న బస్సు వద్దకు వచ్చిన చిరుత అమాంతం కిటికీలో తలపెట్టి లోపలికి తొంగిచూసింది. దీంతో లోపలున్నవారు హడలిపోయారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బెంగుళూరు లోని బన్నెర్ ఘట్ట నేషనల్ పార్క్ సఫారీలో ఓ చిరుత టూరిస్ట్ లకు షాక్ ఇచ్చింది. దెబ్బకు అందరికి సుసూ పడేలా చేసింది. వాళ్లు పులి ని చూడడానికి వెళ్తే ...అదే వీళ్లని చూడడానికి వచ్చింది. పార్క్ సఫారీలో యానిమల్స్ ను చూడడానికి ప్రయాణిస్తున్న బస్సు వద్దకు వచ్చిన చిరుత అమాంతం కిటికీలో తలపెట్టి లోపలికి తొంగిచూసింది. దీంతో లోపలున్నవారు హడలిపోయారు.
కిటికీ తెరిచి ఉండడం, కాళ్లు బస్సుపై వేసి నిలబడి లోపలికి తొంగి చూడడంతో ఏం జరుగుతుందో తెలియక పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయభ్రాంతులు అనడం కంటే దారుణంగా భయపడ్డారు. దీంతో వెంటనే డ్రైవర్ నెమ్మదిగా బస్సును ముందుకు కదిలించాడు. దీంతో చిరుత వెంటనే గుహలోకి వెళ్లిపోయింది.
ఆదివారం ఈ ఘటన జరిగినట్టు పార్క్ అధికారులు తెలిపారు. వన్యప్రాణులను మరింత స్పష్టంగా చూసేందుకు సఫారీ డ్రైవర్ వాహనాన్ని దగ్గరగా తీసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. అయితే, అనుకోకుండా చిరుత బస్సు వద్దకు రావడంతో సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ లిమిట్ లైన్ దాటకుండా డ్రైవర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇస్తామని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటామని జూ అధికారులు తెలిపారు.
Come face-to-face with leopards in its near-natural habitat at Bannerghatta Biological Park #Bengaluru. Its the only
Tags : newslinetelugu viral-news national bengalore