త్రివిధ దళాలు పాల్గొని 80మంది ఉగ్రవాదులను మట్టుపట్టించారు. అయితే ఈ ఆపరేషన్ లో ముఖ్యంగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక దళాలు విరుచుకుపడ్డాయి. "ఆపరేషన్ సింధూర్" పేరుతో సైనిక చర్యలో , త్రివిధ దళాలు పాల్గొని 80మంది ఉగ్రవాదులను మట్టుపట్టించారు. అయితే ఈ ఆపరేషన్ లో ముఖ్యంగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
ఇండియన్ ఆర్మీ ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం తన దగ్గర ఉన్న చాలా పవర్ ఫుల్ అస్త్రాలను వినియోగించింది. సైనిక కార్యకలాపాల్లో వినియోగించిన ఆయుధాల వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ , లక్ష్యాలను ఛేదించిన తీరును బట్టి ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ , క్షిపణులు , హ్యామర్ తరహా స్మార్ట్ బాంబ్స్ ను యూజ్ చేసి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
శత్రువులను గుర్తించి, వారిపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న ఆత్మాహుతి డ్రోన్లను ఈ దాడుల్లో ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. అయితే శత్రువులను గుర్తించడం కూడా భారత్ కు పెద్ద టాస్క్ . అయితే వీటి ద్వారా మన దళాల వైపు ప్రాణనష్టం లేకుండా చూసుకున్నారు.ఈ ఆత్మాహుతి డ్రోన్స్ 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఈ డ్రోన్స్ టార్గెట్ ను కరెక్ట్ గా రీచ్ అవుతాయి, స్కాల్ప్ దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను రఫేల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించి ఉండొచ్చని ఒక అంచనా. ఇవి ఉపయోగించడం వల్ల ఎక్కడో భూమి లోతుల్లో బంకర్స్ లో దాక్కున్న వారిని కూడా బయటకు తీసుకురావచ్చు.ఈ స్మార్ట్ బాంబులను లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు.