Rahul Dravid: ప్లీజ్‌..దయచేసి నాకు ఉద్యోగం చూసి పెట్టండి : రాహుల్ ద్రవిడ్‌

Published 2024-07-01 19:36:23

postImages/2024-07-01/1719842783_19dravid.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దక్షిణాఫ్రికాను (SOUTH AFRICA) ఓడించి భారత జట్టు రెండో సారి టీ 20 వరల్డ్ కప్ ను గెలుచుకున్నారు. 140 కోట్ల మంది భారత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇక టీంఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్( RAHUL DRAVID)  ఆనందం అంతా ఇంతా కాదు..ఆయన ఈ క్షణం కోసం ఎన్నో యేళ్లు కలలు కన్నారు.


అందరూ సెలబ్రేట్ చేసుకుంటుండగా, ఆయన మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. తక్కువగా మాట్లాడే ఆయన తొలిసారిగా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకుంటూ కనిపించారు. అయితే ఈ మ్యాచ్ తో తన మూడేళ్ల( 3 YEARS)  పదవీ కాలం ముగిసింది. ఈ సెలబ్రేషన్స్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ రోజుతో తన పదవీ కాలం ముగిసిందని ..ఇకపై తనకు ఉద్యోగం లేదని ఏమైనా ఉద్యోగం( JOB LESS)  ఉంటే చూడమంటూ జోక్ చేశారు.టోర్నీలో టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింద‌న్నారు. ప్లేయ‌ర్లంద‌రూ గొప్ప‌గా ఆడార‌ని, ఇది నిజంగా అద్భుత‌మైన జ‌ట్టు అని పేర్కొన్నారు.  


ద్రవిడ్ 2021లో న‌వంబ‌ర్‌లో టీమిండియా ( TEAM INDIA) ప్ర‌ధాన కోచ్‌ పదవీ బాధ్యతలు  చేపట్టారు. అప్పటి నుంచి 2023 వరకూ భార‌త జ‌ట్టుకు సేవలు అందించారు. కాగా, గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ తోనే ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగియాల్సింది. కానీ, బీసీసీఐ( BCCI)  కోరిక మేర‌కు 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ( WORLD CUP) వ‌ర‌కు ఆయన తన బాధ్యతలను కొన‌సాగించారు. కాని ఇప్పుడు ఇక చెయ్యలని లేదని తెలిపాడు. ఇదిలాఉంటే.. త‌దుప‌రి టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్( GOWTHAM GAMBIR)  పేరు వినిపిస్తోంది. ద్రవిడ్ ( RAHUL DRAVID) వారసుడిగా గంభీర్ దాదాపు క‌న్ఫార్మ్ అయిన‌ట్లు తెలుస్తోంది.