Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో రిలీఫ్ !

9వ తేదీ వరకు వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని కూడా తెలిపింది.


Published Dec 02, 2024 02:32:00 PM
postImages/2024-12-02/1733130175_115715053.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ చేసిన కేసులకు సంబంధించి మూవీ డైరక్టర్ రామ్ గోపాల్ వర్శకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు విచారింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు అందించాలని ఆదేశించడంతో పాటు సరైన వివరణ కూడా కోరింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా కూడా వేసింది. 9వ తేదీ వరకు వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని కూడా తెలిపింది.


మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వర్మ స్పందించలేదు. పోలీసు విచారణకు ఆయన ఇప్పటి వరకు హాజరుకాలేదు. ఓవైపు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిక్కడు దొరకడు లాగా ..పోలీసులు ఆర్జీవీ కోసం వెతుకుతుంటే ...ఆయన మాత్రం ఛానల్స్ కు ఇంటర్వ్యూస్ ఇస్తూ పోలీసులకు మరింత షాకులిస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ap rgv aphighcourt photos

Related Articles