BIRTHDAY CAKES: పుట్టినరోజుకు కేక్స్ తెస్తున్నారా ...క్యాన్సర్ ను తెచ్చుకున్నట్లే !

బెంగళూరులోని వివిధ బేకరీలలో విక్రయించే వివిధ రకాల కేక్‌ల నమూనాలను పరీక్షించారు. కొన్ని కేకుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే హానికరమైన పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. 


Published Oct 18, 2024 02:26:00 PM
postImages/2024-10-18/1729241844_RedVelvetCakeTOHcomFB2442588P2MD09123b.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు కేక్ తెలియని వారు ...అందులోను పేస్ట్రీ కల్చర్ ..పెళ్లి , ఎంగేజ్ మెంట్ , బర్త్ డే లు , సంధర్భం ఏదైనా కేక్ తోనే సెలబ్రేషన్స్. అయితే ప్రత్యేకంగా...రెడ్ వెల్ వెట్ కేక్స్ లో.. కలర్స్ ఎక్కువగా వాడే కేక్స్ లో దారుణమైన కెమికల్స్ వాడతారు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. రెడ్ వెల్వెట్ వంటి 12 రకాల కేకుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలిందని నివేదిక వెల్లడించింది. ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులోని వివిధ బేకరీలలో విక్రయించే వివిధ రకాల కేక్‌ల నమూనాలను పరీక్షించారు. కొన్ని కేకుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే హానికరమైన పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. 


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బేకరీలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ శ్రీనివాస్ కే హెచ్చరించారు. పరీక్షించిన 235 కేక్ శాంపిల్స్‌లో 12లో అల్లూరా రెడ్, సన్‌సెట్ ఎల్లో FCF, Ponceau 4R, Tartarazine Carmoisin వంటి కృత్రిమ రంగులు కనుగొన్నారు. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేక్‌లతో సహా, కేక్‌లలో ఉపయోగించే కృత్రిమ రంగులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని క్లారిటీ గా చెప్పుకొచ్చారు. అంతేకాదు...ఇందులో ఎరుపు 40, పసుపు 5 పసుపు 6 వంటి రంగులు బెంజిడిన్, 4-అమినోబిఫెనిల్ 4-అమినోఅజోబెంజీన్ వంటి క్యాన్సర్ కారకాలను కలిగి ఉండవచ్చని తేల్చారు.


మీరు వారం లో ఒక్క రోజు చిన్న పీస్ తిన్నా ..క్యాన్సర్ కు గురవ్వచ్చు. ఒక్క కేకులే కాదు...కలర్ కలిపిన ఏ ఫుడ్ అయినా కూడా  మీ కడుపులో క్యాన్సర్ పుండ్లు పుట్టించేదే. బెంగుళూరులో రోడమైన్-బి వంటి కృత్రిమ రంగులను ఉపయోగించడం వల్ల పీచు మిఠాయి, గోబీ మంచూరియా వంటి స్ట్రీట్ ఫుడ్ కూడా కొంతకాలం క్రితం నిషేధించారు. అయినా వాటిని తింటూనే ఉన్నారు. దీని వల్ల ఎం తప్రమాదం అని చెప్పినా వినే వారు లేరు. 
 

newsline-whatsapp-channel
Tags : food-safety cup-cakes birthday cancer

Related Articles