Shoaib Akhtar: ఈసారి ప్ర‌పంచ‌క‌ప్ భార‌త్‌దే: షోయ‌బ్ అక్త‌ర్‌ ! 2024-06-26 15:35:04

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికా ( AMERICA)  , విండీస్( WESTINDIES)  మూకుమ్మడిగా ...టీ 20( T20 WORLD CUP)  ప్రపంచకప్ కు ఆతిధ్యమిస్తున్నాయి. ఈసారి ఆఫ్ఘ‌నిస్థాన్ సెమీ ఫైన‌ల్‌కు చేరుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బంగ్లాదేశ్‌పై( BANGLADESH)  థ్రిల్లింగ్ విక్ట‌రీతో ఆఫ్ఘన్ సెమీస్‌కు దూసుకొచ్చింది. దీంతో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో పాటు భార‌త్‌, ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా సెమీ ఫైన‌ల్ బెర్తులు క‌న్ఫార్మ్ చేసుకున్నాయి. ఇక మొద‌టి సెమీస్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో( AFGHANISTHAN)  ద‌క్షిణాఫ్రికా త‌లప‌డ‌నుండ‌గా, రెండో సెమీస్‌లో భార‌త్‌, ఇంగ్లండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. గురువారం ఈ రెండు మ్యాచులు జరుగుతాయి.


ఈసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచే జ‌ట్టు విష‌య‌మై పాకిస్థాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్( SHOYAB AKTHAR)  త‌న యూట్యూబ్ ఛానెల్‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. టీమిండియాకు వంద శాతం ఈ సారి వరల్డ్ కప్( WORLD CUP ) వస్తుందని అన్నారు.. వ‌న్డే ప్రపంచ కప్-2023 గెలుచుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన భార‌త్( BHARATH) .. టీ20 ప్రపంచ కప్  గెలిచేందుకు వంద‌కు వంద శాతం అర్హ‌త ఉంద‌న్నాడు. టీమిండియా క‌చ్చితంగా ఈసారి గెల‌వాల‌ని ఆయ‌న కోరాడు. ట్రోఫీని అందుకోవడానికి రోహిత్ శర్మ వర్త్ అని అన్నారు.


ఇక గతేడాది స్వ‌దేశంలో జ‌రిగిన‌ వన్డే ప్రపంచకప్‌( WORLD CUP)  ఫైనల్‌లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియాను క‌చ్చితంగా ఓడించాలనే పట్టుదల భారత్‌కు కలిగిందని అక్త‌ర్ చెప్పుకొచ్చాడు. "భారత్‌ది స‌మ‌ష్టి విజయం. గెలవాల్సిన ప్రపంచకప్‌లో ఓడిపోయిన తర్వాత వారు నిరాశకు లోనయ్యారు.