Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కూతురుకి ప్రమాదం ..బస్సును ఢీకొట్టిన కారు !

ప్రమాద సమయంలో కారును గంగూలీ డ్రైవర్ నడుపుతుండగా సనా పక్క సీటులో కూర్చుందని వివరించారు.


Published Jan 04, 2025 02:56:00 PM
postImages/2025-01-04/1735982868_cr20250104tn6778ca4873406.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ప్రముఖ క్రికెటర్ , బిసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ కూతురు సనా గంగూలీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. సనా కారును ఓ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది . కోల్ కత్తా లోని డైమండ్ హార్బర్ లో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో కారు మాత్రమే డ్యామేజీ అయ్యింది. సనాకు మాత్రం గాయాలు ఏం కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును గంగూలీ డ్రైవర్ నడుపుతుండగా సనా పక్క సీటులో కూర్చుందని వివరించారు.


బెహలా చౌరస్తాలో సనా కారును ఢీ కొట్టిన బస్సు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడని చెప్పారు. డ్రైవర్ తో కలిసి సనా బస్సును వెంటాడి కొంతదూరం వెళ్లిన తర్వాత అడ్డగించిందన్నారు. తన సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకొని బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రమాదం పై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు. అంతేకాదు సనా గంగూలీ కి  ఏ ప్రమాదం జరగలేదని క్లియర్ గా తెలిపారు పోలీసులు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cricket-player daughter kolkatta

Related Articles