Gukesh : గుకేశ్ గెల‌వ‌లేదు.. చైనీస్ ఆట‌గాడే కావాలని ఓడిపోయాడు !

అయితే 14 రౌండ్స్ జరిగితే 14 వ రౌండ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను గుకేశ్ చిత్తు చేశాడు. 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 


Published Dec 13, 2024 02:07:00 PM
postImages/2024-12-13/1734079049_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత గ్రాండ్ మాస్టర్  గుకేశ్ కొత్త ప్రపంచ చెప్ చాంపియన్ గా ఘనత సాధించాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో చైనా దిగ్గజం డింగ్ లిరెన్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచాడు గుకేశ్ . అయితే 18 ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. అయితే 14 రౌండ్స్ జరిగితే 14 వ రౌండ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను గుకేశ్ చిత్తు చేశాడు. 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 


గుకేశ్ విజేత నిలిచిన త‌రువాత ర‌ష్యా చెస్ ఫెడ‌రేష‌న్ చీఫ్ ఆండ్రీ ఫిలాటోవ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఫ‌లితం చెస్ అభిమానులు, నిపుణుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌న్నారు. చైనా ఆటగాడి చర్యలు చాలా అనుమానంగా ఉన్నాయని ...గుకేశ్ గెలవలేదని చైనా ఆటగాడు కావాలని ఓడిపోయాడని ఆరోపించింది.దీనిపై అంత‌ర్జాతీయ చెస్ ఫెడ‌రేష‌న్ (ఫిడే) విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశాడు.


నిజానికి 14వ రౌండ్ నాలుగు గంట‌ల పాటు సాగింది. మొత్తం 58 ఎత్తుల్లో మ్యాచ్ పూర్తి అయింది. 55 వ ఎత్తులో ఓ తప్పు చేశాడు. అది కూడా చాలా ఆలోచించి తప్పు చేశాడని ..ఏనుగును కదిపాడు. అప్పుడు గోకేశ్ తన ఏనుగుతో కిల్ చేసి ...అక్కడి నుంచి ఆటను చాలా తెలివిగా నడిపించాడని ఆరోపించారు. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. అయితే విచారణ జరపాలని డిమాండ్ చేశాడు రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ .
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu championship-trophy chess

Related Articles