నటి అనుష్క శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. విరాట్ ఫిట్‌నెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తాడని వివరించారు. ఫిట్ నెస్ , ఫుడ్ విషయంలో ఓ టైమింగ్ ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు చాలా ఫుడ్ డైట్ ఉంటుందని అంటారు. యంగ్ ప్లేయర్స్ తో పోటీ పడుతూ.. ఫిట్ గా ఉంటాడు.
నటి అనుష్క శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. విరాట్ ఫిట్‌నెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తాడని వివరించారు. ఫిట్ నెస్ , ఫుడ్ విషయంలో ఓ టైమింగ్ ఉంటుంది. తనకు ఫుడ్ విషయం అసలు ఫరక్ ఉండదని ..సాల్ట్ , ఉప్పు , కారం ,పెప్పర్ ఏం లేకపోయినా తింటాడు. అతనికి టేస్టీ ఫుడ్ అనేదే లేదు. రోజూ ఉదయం నిద్ర లేవగానే కార్డియో వర్కవుట్స్ చేస్తాడని తెలిపారు. తనతో కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడని అనుష్క చెప్పుకొచ్చారు.
ఇక ఆహారం విషయానికి వస్తే... కోహ్లీ జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లడని చెప్పారు. అలాగే కూల్ డ్రింక్స్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటాడని అనుష్క తెలిపారు. దాదాపు పదేళ్లుగా కోహ్లీ బటర్ చికెన్ తినలేదట. ఇక కోహ్లీ నిద్రకు కూడా తగిన ప్రాధానత్య ఇస్తాడని ఆమె పేర్కొన్నారు. కచ్చితంగా 8 గంటలపాటు పక్కాగా నిద్రపోతాడు. దాంతో ఉదయం చాలా యాక్టివ్ గా ఉంటాడు కూడా.